Crime News: క్వారంటైన్ నుంచి తప్పించుకుని.. వృద్ధురాలిని కొరికి చంపేసిన వ్యక్తి!

murder in tamilnadu
  • తమిళనాడులో ఘటన
  • కలకలం రేపిన 34 ఏళ్ల వ్యక్తి 
  • ఇటీవల విదేశాల నుంచి రావడంతో హోం క్వారంటైన్‌
  • బయటకు వచ్చి దారుణం  
తమిళనాడులో 34 ఏళ్ల ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఇటీవల అతడు విదేశాల నుంచి రావడంతో అతడిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, అతడు పిచ్చి పట్టినట్లు ప్రవర్తించి ఓ వృద్ధురాలి (90) మరణానికి కారణమయ్యాడు. శ్రీలంక నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు అతడు వచ్చాడు. గత రాత్రి హోం క్వారంటైన్‌ను ఉల్లంఘించి, ఒంటి మీద దుస్తులు లేకుండా బయటకు వచ్చాడు.

ఆరు బయట నిద్రిస్తున్న వృద్ధురాలి వద్దకు వెళ్లి దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. దీంతో ఆమె కేకలు వేసింది.. దీంతో స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. ఈ సంఘటనతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. 
Crime News
Tamilnadu
Corona Virus

More Telugu News