CGHS: సీజీహెచ్ఎస్ లబ్దిదారులకు శుభవార్త.. ఒకేసారి మూడు నెలలకు సరిపడే మందులు!

  • కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బంది లేకుండా నిర్ణయం
  • వెల్‌నెస్‌ సెంటర్లకు ఆదేశాలు జారీ
Three months medicene for CGHS benificiries

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ద్వారా లబ్ధిపొందుతున్న దీర్ఘకాల వ్యాధులున్న రోగులకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు నెలల మందులను ఒకేసారి అందించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆయా నగరాల్లోని వెల్‌నెస్‌ సెంటర్లకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు సీజీహెచ్ఎస్ వెల్ నెస్ కేంద్రాలను సంప్రదించి మూడు నెలలకు కావాల్సిన మందులను పొందవచ్చని తెలిపింది.

More Telugu News