Corona Virus: సినీ కార్మికులు, హెల్త్ వర్కర్లకు దగ్గుబాటి కుటుంబం రూ.కోటి ఆర్థిక సాయం

one crore donation from daggubati family to cine workers
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్పందన
  • కష్టకాలంలో ఇబ్బందుల దృష్ట్యా సాయం
  • ఇప్పటికే రూ.కోటి ప్రకటించిన చిరంజీవి
కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న దృష్ట్యా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులు, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న హెల్త్ వర్కర్లకు మానవతా దృక్పథంతో కోటి రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు సురేష్‌ ప్రొడక్షన్స్‌ యాజమాన్యమైన దగ్గుబాటి కుటుంబం ప్రకటించింది. ఈ మేరకు దగ్గుబాటి కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు, హీరోలు వెంకటేశ్, రానాలు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సాయాన్ని కార్మికులు, హెల్త్‌వర్కర్ల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. కాగా, సినీ కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
Corona Virus
cinema workers
daggubati family
suresh productions
one crore help

More Telugu News