Radhika Apte: నేను కరోనా పరీక్షల కోసమేమీ ఆసుపత్రికి రాలేదు: 'లెజెండ్‌' హీరోయిన్‌

Not For COVID19 Radhika Apte Clarifies After Hospital Visit
  • ముఖానికి మాస్క్‌తో ఆసుపత్రికి రాధికా ఆప్టే
  • ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నటి
  • కరోనా పరీక్షల కోసం రాలేదని వెల్లడి
'లెజెండ్' సినిమాలో బాలకృష్ణ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తాను కరోనా పరీక్షలు  చేయించు కోలేదని తెలిపింది. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది. ముఖానికి మాస్కు ధరించి ఓ ఆసుపత్రిలో ఉన్న ఫొటోను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తాను ఆసుపత్రికి వచ్చానని, అయితే, కరోనా పరీక్షల కోసం కాదని తెలిపింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా బాగానే ఉందని హాష్ ట్యాగ్స్ జత చేసింది. ఇంట్లోనే ఉండి, భద్రంగా ఉండాలని సూచించింది. .
Radhika Apte
Hospital Visit
Not For COVID19
Bollywood
Tollywood

More Telugu News