India: ఆ 15 లక్షల మందిపై నిఘా.. వారు నివసిస్తున్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించే యోచన!

  • 15 జనవరి నుంచి 23 మార్చి మధ్య దేశానికి 15 లక్షల మంది రాక
  • వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశం
  • వారి నివాస ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించాలన్న కేంద్రం
Center asks states to quarantine who came from abroad

కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన 15 లక్షల మందిపై నిఘాకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీరంతా జనవరి 15 నుంచి 23 మార్చి మధ్య దేశానికి వచ్చిన వారే. వీరందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ నిఘా పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాలకు లేఖలు రాశారు. స్వదేశానికి వచ్చిన వీరందరూ 14 రోజులపాటు నిర్బంధంలో ఉండేలా చూడాలని అందులో పేర్కొన్నారు.

పైన పేర్కొన్న కాలంలో విదేశాల నుంచి 15 లక్షల మంది స్వదేశానికి చేరుకున్నట్టు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమాచారం అందించిందని, ఈ నేపథ్యంలోనే వీరిపై నిఘా పెట్టాలంటూ రాష్ట్రాలను ఆదేశించినట్టు కేబినెట్ కార్యదర్శి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన కొందరికి మాత్రమే పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్న కేంద్రం.. వారు నివసిస్తున్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించాలని సూచించింది. అలాగే, వారందరూ ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

More Telugu News