Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Kajal in Mosagallu flick
  • 'మోసగాళ్లు' కోసం భారీ సెట్ 
  • మెమరీ లాస్ యువకుడిగా నిఖిల్ 
  • అప్సెట్ అయిన యాంకర్ ప్రదీప్ 
 *  విష్ణు మంచు హీరోగా హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోసగాళ్లు' చిత్రం కోసం హైదరాబాద్ శివారు కూకట్ పల్లిలో మూడున్నర కోట్ల వ్యయంతో ఐటీ ఆఫీస్ సెట్ ను వేశారు. అయితే, కరోనా వ్యాధి పడగవిప్పిన నేపథ్యంలో షూటింగును వాయిదా వేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
*  యంగ్ హీరో నిఖిల్ 'అర్జున్ సురవరం' తర్వాత తన తదుపరి చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో చేస్తున్నాడు. '18 పేజెస్' పేరిట రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ పాత్ర వెరైటీగా సాగుతుందట. జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సమస్యలను ఎదుర్కునే యువకుడిగా ఇందులో నిఖిల్ కనిపిస్తాడు. అతని సరసన అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది.        
*  బుల్లితెరపై పెద్ద యాంకర్ గా పేరుతెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రం ఈ నెలలో విడుదల కావలసి వుంది. అయితే, ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో చిత్రం వాయిదాపడింది. దీంతో ఇప్పటికే ఎంతగానో ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకున్న హీరో ప్రదీప్ అప్సెట్ అయ్యాడట.
Kajal Agarwal
Nikhil
Anu Emmanuel
Pradip Machiraju

More Telugu News