Congress: ఇప్పుడు పాస్ చేసి.. ఇంటర్‌కు ఎంట్రన్స్ పెట్టండి: ఏపీ కాంగ్రెస్

AP Congress demands to pass all 10th Students
  • పదో తరగతి పరీక్షలను వాయిదా వేయండి
  • విద్యార్థులందరినీ ఇంటర్‌కు ప్రమోట్ చేయండి
  • కింది తరగతిలో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకోండి
కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులకు ఇంటర్‌లో నేరుగా ప్రవేశం కల్పించాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పటికైతే విద్యార్థులందరినీ పాస్ చేయాలని, అవసరం అనుకుంటే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్ డిమాండ్ చేశారు. విద్యార్థులను ప్రమోట్ చేసేందుకు కింది తరగతిలో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరును ప్రాతిపదికగా తీసుకోవాలని వారు కోరారు.
Congress
Andhra Pradesh
10th Students
Corona Virus

More Telugu News