Narendra Modi: ప్రియమైన బోరిస్ జాన్సన్... ఇది మీకో లెక్కా!: ప్రధాని మోదీ

PM Modi wishes UK PM Boris Johnson
  • బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్
  • ట్విట్టర్ లో పరామర్శించిన ప్రధాని మోదీ
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రియమైన బోరిస్ జాన్సన్, మీరు పోరాట యోధులు. ఈ సవాల్ ను మీరు తప్పకుండా అధిగమిస్తారు. మీకు మంచి ఆరోగ్యం సంప్రాప్తించాలని కోరుకుంటూ, బ్రిటన్ త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ తో తీవ్రస్థాయిలో ప్రభావితమైన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. ప్రస్తుతం బ్రిటన్ లో 11,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 586 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.

  • Loading...

More Telugu News