నాకు పొగరు అనుకునే వాళ్లకి .. లేదు అని నేను ఎందుకు చెప్పాలి?: నటుడు ఉత్తేజ్

27-03-2020 Fri 17:39
  • అలా అనుకోవడం వాళ్ల సంస్కారం 
  •  సమాధానాలు చెప్పుకుంటూ వెళ్లడం నా పని కాదు 
  • ఎవరిష్టం వాళ్లదన్న ఉత్తేజ్  
Uttej
అనేక చిత్రాలలో నటుడిగా విభిన్నమైన పాత్రలను పోషించిన ఉత్తేజ్, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి వచ్చిన విమర్శపై స్పందించాడు. "నాకు పొగరు ఎక్కువ అనే టాక్ వున్నట్టుగా చెబుతున్నారు .. అలా అనుకునే వాళ్లకి నేను సమాధానం చెప్పను. ఎవరి అభిప్రాయం వాళ్లకి ఉంటుంది. వాళ్ల మనస్తత్వాన్ని బట్టి .. వ్యక్తిత్వాన్ని బట్టి .. చదువును బట్టి .. సంస్కారాన్ని బట్టి .. పెంపకాన్ని బట్టి .. సర్కిల్ ను బట్టి అవతలివారి గురించి కామెంట్ చేస్తుంటారు.

ఖాళీగా కూర్చుని అలా కామెంట్ చేసుకుంటూ పోయేవాళ్లకి, పనులు మానుకుని సమాధానాలు చెబుతూ కూర్చోవడం నా వల్ల కాదు. బిజీగా వుండి ఫోన్ ఎత్తకపోతే పొగరు అనుకునే వాళ్లకి ఏమని చెప్పగలం? అనుకోనివ్వండి వాళ్ల దారి వాళ్లది .. నా తీరు నాది. జీవితం నేర్పిన పాఠాల వలన నేను ఇలా అనుకోగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.