వేషాలు అడగడానికి మొహమాటపడను: నటుడు ఉత్తేజ్

27-03-2020 Fri 15:12
  • నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది 
  • సినిమాయే నా జీవనాధారం 
  • నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవన్న ఉత్తేజ్  
Uttej
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు ఉత్తేజ్. ఎన్నో సినిమాల్లో ఆయన విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. కొన్ని సినిమాలకి ఆయన సంభాషణలు కూడా రాశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను ఇండస్ట్రీలో చాలా కాలం నుంచే ఉంటున్నాను. అయినా నేను ఎవరినీ వేషాలు అడగడానికి సిగ్గుపడను. కొత్త దర్శకులను కూడా అవకాశం ఇవ్వమని అడుగుతాను. మూడు సీన్ల వేషం వున్నా ఇవ్వండి సార్ అని మొహమాటం లేకుండా అడుగుతాను.

నాకు సినిమానే జీవనాధారం .. నటన తప్ప నాకు మరేమీ తెలియదు. మా నాన్న నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. నాకు పొలాలు లేవు .. రెంట్లు రావు. అయితే దర్శకులు కూడా ఉద్దేశ పూర్వకంగా అవకాశాలు ఇవ్వకపోవడం ఉండదు. వాళ్లకి ఉండవలసిన సమస్యలు వాళ్లకి ఉంటాయి. నాకు తగిన పాత్ర అనిపిస్తే వాళ్లు నన్నే పిలుస్తారు" అని చెప్పుకొచ్చాడు.