Allu Arjun: మానవత్వం కలిగిన మనిషిగా స్పందించి సాయం చేస్తున్నాను: హీరో అల్లు అర్జున్‌ వీడియో

Allu Arjun donates money
  • మొత్తం రూ.1.25 కోట్లు ఇస్తాను
  • ఏపీ, తెలంగాణ, కేరళకు సాయం
  • ప్రజలంతా కలిసి పోరాడాలి
  • కరోనాను త్వరలోనే నిర్మూలిస్తారని ఆశిస్తున్నా
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చేస్తోన్న పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తం రూ.1.25 కోట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకే కాకుండా కేరళ ప్రభుత్వానికి కూడా ఆయన అందజేయనున్నారు. కేరళలోనూ బన్నీకి చాలా మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

చాలా మంది జీవితాలను కరోనా దెబ్బతీసిందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం కలిగిన మనిషిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ప్రజలకు కలిపి ఈ సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా కలిసి పోరాడి కరోనాను త్వరలోనే నిర్మూలిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు సినీ హీరోలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Allu Arjun
Corona Virus
Tollywood

More Telugu News