Hyderabad: నవ వధువు అదృశ్యం... ఆందోళనతో భర్త ఫిర్యాదు

  • ఐదురోజుల క్రితమే కామ్‌గార్‌నగర్‌లో పెళ్లి
  • ఉగాది సామగ్రి తెచ్చేందుకు మార్కెట్‌కు
  • ఆ తర్వాత తిరిగి రాని వైనం
పెళ్లయి వారం రోజులు కాకముందే భార్య కనిపించకుండా పోవడంతో ఆందోళనతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు...హైదరాబాద్‌లోని కామ్‌గార్‌నగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణకు, ఐశ్వర్య (20)తో ఈనెల 20వ తేదీన పెళ్లయింది.

ఉగాది పండుగ కోసం పూజసామగ్రి, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. దీంతో ఎవరైనా తెలిసిన వారింటికి వెళ్లిందేమోనని సత్యనారాయణ చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లలో వెతికాడు. ప్రయోజనం లేకపోయింది. బుధవారం అంతా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Hyderabad
kachiguda
newly married women
missing

More Telugu News