Kesineni Nani: నీళ్లు, ఆహారం లేకుండా అలమటిస్తున్నారు: కేసీఆర్, కేటీఆర్‌లకు ఏపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్

kesineni nani on corona
  • విజయవాడ పార్లమెంట్‌కు చెందిన లారీ డ్రైవర్లు తెలంగాణలో ఉన్నారు
  • తూప్రాన్, మనోరాబాద్ గ్రామం సీసీఐ గోడౌన్స్ లో చిక్కుకుపోయారు
  • వెంటనే ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలి
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో తెలంగాణలో విజయవాడ వాసులు చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. 

'విజయవాడ పార్లమెంట్ కు చెందిన కొందరు లారీ డ్రైవర్లు తెలంగాణలోని మెదక్ జిల్లా, తూప్రాన్ మండలం మనోరాబాద్ గ్రామం సీసీఐ గోడౌన్స్ లో చిక్కుకుని నీరు, ఆహారం లేకుండా అలమటిస్తున్నారు. వెంటనే ఆహారం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను' అంటూ తెలంగాణ సీఎంవో, కేటీఆర్‌, తెలంగాణ డీజీపీకి ట్వీట్ చేశారు. లారీ డ్రైవర్ల ఫోన్ నంబర్లు, ఫొటోలను పోస్ట్ చేశారు.
Kesineni Nani
KTR
Telangana

More Telugu News