Varla Ramaiah: ప్రజావేదిక ఇప్పుడు ఉండివుంటే బాగా ఉపయోగపడేది: వర్ల రామయ్య

Varla Ramaiaah Comments on Prajavedika Demolishion
  • ప్రజా వేదికను కూల్చి తప్పు చేశారు
  • కూల్చకుండా ఉంటే క్వారంటైన్ సెంటర్ గా ఉపయోగపడేది
  • మీ దుందుడుకు చర్యతో ప్రజలకు నష్టమన్న వర్ల
ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చి వేయకుండా ఉండివుంటే, అదిప్పుడు క్వారంటైన్ సెంటర్ గా ఎంతో ఉపయోగపడి వుండేదని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ముఖ్యమంత్రి గారు! బంగారం లాంటి ప్రజావేదికను అనాలోచితంగా కూలగొట్టించారు. అదే ఇప్పుడుంటే, కరోన బాధితుల క్వారంటైన్ గా బ్రహ్మాండంగా ఉపయోగపడేది. మీ అనుభవ రాహిత్యం, దుందుడుకు చర్య రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మీ రాజకీయ జీవితంలో ఈ కూల్చివేత పెద్ద మచ్చగా మిగులుతుంది" అని అన్నారు.
Varla Ramaiah
Prajavedika
Jagan
Twitter

More Telugu News