Junior NTR: 'సారీ బ్రదర్‌.. నీ గిఫ్టు ఇప్పుడు రాజమౌళి దగ్గరుంది' అంటూ రామ్‌ చరణ్‌ను నిరాశకు గురి చేసిన ఎన్టీఆర్‌

Jr NTR Sorry brother  RamCharan
  • చెర్రీకి ఈ రోజు ఉదయం 10 గంటలకు గిఫ్ట్‌ ఇస్తానన్న తారక్‌
  • అభిప్రాయం కోసం రాజమౌళికి పంపానని వ్యాఖ్య
  • దీంతో అనుకున్న సమయానికి ఇవ్వలేకపోతున్నానని ట్వీట్‌
సినీనటుడు రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మర్చిపోలేని గిఫ్ట్‌ ఇస్తానని జూనియర్‌ ఎన్టీఆర్‌ నిన్న ప్రకటించాడు. 'నీ పుట్టిన రోజు వేడుకలు ప్రస్తుత పరిస్థితుల్లో జరుపుకోలేకపోయినా కచ్చితంగా నీవు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ను నేను డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై రేపు ఇస్తాను' అంటూ తారక్ నిన్న ట్వీట్ చేశాడు. ఈ రోజు ఉదయం 10 గంటలకే ఇస్తానన్నాడు. దాని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెర్రీ కూడా రిప్లై ఇచ్చాడు.

అయితే, చెర్రీని తారక్ నిరాశ పర్చాడు. ఈ రోజు మరో ట్వీట్‌ చేస్తూ గిఫ్ట్‌ ఇవ్వలేకపోతున్నానని తెలిపాడు. 'సారీ బ్రదర్‌... నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్‌ను అభిప్రాయం కోసం నేను గత రాత్రి జక్కన్న వద్దకు పంపాను. రాజమౌళి వద్దకు వెళితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నీకు తెలుసు.. కాస్త ఆలస్యం అవుతుంది' అని తెలిపాడు. దీంతో మెగా అభిమానులు కూడా నిరాశకు గురవుతున్నారు.
Junior NTR
Ramcharan
Rajamouli
Tollywood

More Telugu News