Corona Virus: కరోనా దెబ్బకు హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్!

  • గతేడాదితో పోలిస్తే 50 శాతం పడిపోయిన విక్రయాలు
  • దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 42 శాతం తగ్గిన నివాస గృహాల అమ్మకాలు
  • వెల్లడించిన ‘అనరాక్’
Real Estate Affected Mostly In Hyderabad Coronavirus Fears

ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ వైరస్ అన్ని రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు దేశంలోని స్థిరాస్తి రంగం కుదేలైంది. హైదరాబాద్‌లో అయితే మరింత దారుణ పరిస్థితులు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోవడం కలవరపెడుతోంది. దేశంలోని మరే నగరంలోనూ అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోలేదు.

స్థిరాస్తి రంగం తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేసే బ్రోకరేజీ సంస్థ ‘అనరాక్’ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. పైన పేర్కొన్న త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 42 శాతం తగ్గినట్టు ఈ నివేదిక వివరించింది. గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ ఏడు నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్టు పేర్కొంది. ఇక, ఢిల్లీలో 41 శాతం, ముంబై, పుణెల్లో 42 శాతం, బెంగళూరులో 45 శాతం, చెన్నైలో 36 శాతం అమ్మకాలు పడిపోయినట్టు అనరాక్ తెలిపింది.

More Telugu News