నితిన్ కెరియర్లోనే ప్రత్యేకం .. 'పవర్ పేట'

Fri, Mar 27, 2020, 09:39 AM
Power Peta Movie
  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' 
  • 1960 -2020కి మధ్య నడిచే కథ 
  • 3 గెటప్పుల్లో కనిపించనున్న నితిన్
ఈ ఏడాది నితిన్ 'భీష్మ' సినిమాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమాగా 'రంగ్ దే' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. 1960 నుంచి 2020 వరకూ జరిగే కథ ఇది. ఈ కాలక్రమంలో ఒక్కో దశలో ఒక్కో లుక్ తో నితిన్ కనిపించనున్నాడట.

18 ఏళ్ల యువకుడిగా .. 40 ఏళ్ల వ్యక్తిగా .. 60 ఏళ్ల వృద్ధుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. ప్రతి దశలోనూ నితిన్ లుక్ .. బాడీ లాంగ్వేజ్ .. ఆ పాత్రకి గల కొత్తదనం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ తరహా కథను తొలిసారిగా చేస్తుండటంతో, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha