Ramcharan: మీరందరూ నాకో బహుమతి ఇవ్వాలి!: పుట్టినరోజున అభిమానులకు రామ్ చరణ్ విన్నపం

Ramcharan Bithday today
  • అర్ధరాత్రి నుంచి ఫ్యాన్స్ విషెస్
  • లాక్ డౌన్ ముగిసేంత వరకూ ఇంట్లోనే ఉండండి
  • అదే తనకిచ్చే బెస్ట్ గిఫ్టన్న రామ్ చరణ్
నేడు మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు! రెండు రోజుల క్రితం చెర్రీ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించగా, గత అర్ధరాత్రి నుంచి అది ఫ్యాన్స్ విషెస్ తో నిండిపోయింది. వేలాది మంది అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ తనపై చూపుతున్న అభిమానంపై స్పందించిన రామ్ చరణ్, "మీరు అర్ధరాత్రి నుంచి మనస్ఫూర్తిగా అందిస్తున్న అభినందనలతో ఎంతో ఆనందంగా ఉంది. దీంతో పాటు, మీరు నాకు ఇంకో బహుమతి ఇవ్వాలి. లాక్ డౌన్ ముగిసేంత వరకూ దయచేసి అందరూ ఇళ్లల్లోనే ఉండండి. ఇదే మీరందరూ నాకు ఇచ్చే అత్యుత్తమ బహుమతి" అని అన్నారు.
Ramcharan
Birthday
Wishes
Lockdown
Twitter

More Telugu News