Go Air: అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి: గో ఎయిర్

Go Air ready to give their flight for essential services
  • దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్
  • పార్కింగ్ లో వున్న 650 విమానాలు
  • విమానాలతోపాటు సిబ్బందినీ సమకూర్చేందుకు గో ఎయిర్ సిద్ధం
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవల కోసం తమ విమానాలు వాడుకోవచ్చంటూ గో ఎయిర్ ప్రభుత్వానికి తెలిపింది. పౌరులను చేరవేసేందుకు విమానాలు ఇస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా సమకూరుస్తామని పేర్కొంటూ విమానయానశాఖ, డీజీసీఏలకు తెలియజేసింది. 56 విమానాలు ఉన్న గో ఎయిర్ సంస్థకు 5,500 మంది సిబ్బంది ఉన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అన్ని సంస్థలకు చెందిన దాదాపు 650 విమానాలు పార్కింగ్ లో వున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలకు తమ విమానాలను వినియోగించుకోవచ్చంటూ గో ఎయిర్ ప్రభుత్వానికి సూచించింది.
Go Air
flights
Corona Virus
DGCA

More Telugu News