Ramcharan: రేపు హీరో రామ్ చరణ్ బర్త్ డే.. స్పెషల్ సాంగ్ చేసిన అభిమానులు

Hero Ram charan birth day song by Fans
  • మెగాస్టార్ చిరంజీవి, సురేఖకు ధన్యవాదాలు తెలిపిన అభిమానులు
  • ‘హే అందరి జిందగీ మొత్తం  నీ కోసం..’ అంటూ సాంగ్ ప్రారంభం
  • రామ్ కొణిదెల బర్త్ డే సాంగ్ పేరిట మధుర ఆడియో నుంచి రిలీజ్
రేపు ‘మెగా’ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. రామ్ కొణిదెల బర్త్ డే సాంగ్ ను మధుర ఆడియో రిలీజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తమకు గిఫ్ఠ్ గా ఇచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖకు ధన్యవాదాలంటూ ప్రారంభయ్యే ఈ వీడియోలో ‘హే అందరి జిందగీ మొత్తం  నీ కోసం...’ అంటూ సాగే సాంగ్ లో చెర్రీ ఇంతవరకూ నటించిన చిత్రాలకు సంబంధించి వివిధ గెటప్  లలో ఉన్న పోజ్ లు కనబడతాయి. కాగా, చరణ్ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు రేపు ఘనంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ  ‘కరోనా’ నేపథ్యంలో ఎటువంటి ఆర్భాటాలు వద్దని ఫ్యాన్స్ కు చెర్రీ చేసిన సూచనల మేరకు వాటికి దూరంగా ఉండనున్నారు.
Ramcharan
Tollywood
Birthday
song
Madhura
Audio

More Telugu News