Pooja Hegde: హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న పూజ హెగ్డే!

Bommarillu Bhaskar Movie
  • అఖిల్ జోడీగా పూజ తాజా చిత్రం 
  •  ప్రభాస్ సరసన చేస్తున్న సినిమా సెట్స్ పై 
  • చరణ్ సినిమాలోను దక్కిన ఛాన్స్
తెలుగులో ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతున్న కథానాయికగా పూజ హెగ్డే కనిపిస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు .. వరుసగా బ్లాక్ బస్టర్లు .. పూజ కెరియర్ ను పరిగెత్తిస్తున్నాయి. మరో వైపు తమిళం నుంచి .. హిందీ నుంచి కూడా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూజ పారితోషికాన్ని పెంచేసింది. అయినా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా కోసం కూడా పూజ భారీ పారితోషికాన్ని తీసుకుందని అంటున్నారు. సాధారణంగా హీరోయిన్ కంటే హీరోకి పారితోషికం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా కోసం అఖిల్ కంటే పూజ హెగ్డే అందుకున్న పారితోషికం ఎక్కువని అంటున్నారు. అఖిల్ కి వరుస పరాజయాలు పడటం .. పూజ వరుస విజయాలతో దూకుడు మీద ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న ఆమె, చరణ్ తోను ఓ సినిమా చేయనుందని అంటున్నారు.
Pooja Hegde
Akhil
Most Eligible Bachelor Movie

More Telugu News