swetha pandit: ఇలాంటప్పుడు మన దేశానికి తిరిగి రావడం ఇష్టం లేక ఇటలీలోనే ఉండిపోయా: సింగర్ శ్వేతా పండిట్

Indian Singer Swetha Pandit who heldup in Italy Statement
  • కొన్ని రోజులుగా స్వీయ నిర్భంధంలో ఉండిపోయా
  • ప్రతిరోజూ అంబులెన్స్ ల సైరన్లతోనే నాకు మెలకువ వస్తోంది
  • హోలీకి మన దేశానికి వద్దామనుకున్నా, కానీ రాలేకపోయా
కరోనా వైరస్ కారణంగా ఇటలీలోనే చిక్కుకుపోయానని, భారత్ కు రావాలని ఉన్నప్పటికీ తనది రాలేని పరిస్థితి అని హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన సింగర్ శ్వేతా పండిట్ చెబుతోంది. ప్రస్తుతం ఇటలీలో ఉన్న శ్వేతా పండిట్.. కొన్ని రోజులుగా స్వీయ నిర్భంధంలో ఉండిపోయానని, ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇటలీలో ఉన్న తనకు ప్రతిరోజూ అంబులెన్స్ ల సైరన్లతోనే మెలకువ వస్తోందంటూ అక్కడి పరిస్థితి ఎలా ఉందో గుర్తుచేసింది. ఈ మహమ్మారి గురించి ఇటలీ వాసులు కళ్లు తెరిచేలోపే విజృంభించేసిందని చెప్పింది. అసలు హోలీ పండగకు మన దేశంలోనే ఉందామనుకున్నాను కానీ, ఈ లోపే పరిస్థితులు మారిపోయాయని, ఇలాంటి పరిస్థితిలో మన దేశానికి తిరిగి రావడం తనకు ఇష్టం లేకనే ఒంటరిగా ఉండిపోయానని చెప్పిన శ్వేతా పండిట్, ‘కరోనా’ నియంత్రణకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గుర్తుచేసింది.
swetha pandit
Bollywood
singer
Italy
Corona Virus

More Telugu News