Corona Virus: తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు.. ఇద్దరు డాక్టర్లకు కూడా!

Corona virus cases raises to 44 in Telangana
  • తెలంగాణలో 44కు చేరిన కరోనా కేసులు
  • హైదరాబాదులో డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్
  • 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా
తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా సోకింది. హైదరాబాదులో ఈ మూడు కేసులు నయోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు... దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది.

కుత్బుల్లాపూర్ కు చెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చారు. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకు పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. మరోవైపు నగరంలోని దోమలగూడలో 41 ఏళ్ల వైద్యుడి నుంచి ఆయన భార్యకు కూడా వైరస్ సోకింది. వీరిని ఐసొలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కొత్త కేసులతో తెలంగాణలో వైరస్ సోకినవారి సంఖ్య 44కు చేరుకుంది.
Corona Virus
Telangana
Doctors

More Telugu News