Jagan: సాయంకాలం ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశం

am cm jagan press meet
  • క్యాంపు ఆఫీసులో జగన్ ఉన్నత స్థాయి సమీక్ష
  • ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడానికి చర్యలు
  • జగన్‌ను కలిసి విరాళాలు అందిస్తోన్న ఉద్యోగులు
కరోనా విజృంభణ నేపథ్యంలో తన క్యాంపు ఆఫీసులో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, కరోనాపై తీసుకుంటున్న చర్యలతో పాటు పలు విషయాల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది.

కాగా, ఈ రోజు సీఎం జగన్‌ను కలిసిన సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎన్జీవోలు, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్, విశ్రాంత ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. వారితో పాటు పలువురు సీఎంను కలిసి విరాళాలు ప్రకటిస్తున్నారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News