మలయాళ రీమేక్ లో హీరోగా లారెన్స్

Thu, Mar 26, 2020, 01:17 PM
Ayyappanum Koshiyum Movie
  • మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుం కోశియుం' 
  • తమిళ రీమేక్ లో లారెన్స్ - ప్రియా భవాని 
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు  
ఇటు దర్శకుడిగా .. అటు కథానాయకుడిగా కొంత కాలంగా లారెన్స్ తన దూకుడు తగ్గించాడు. తాజాగా ఆయన ఓ తమిళ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'అయ్యప్పనుం కోశియుం' అనే మలయాళ సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో సాచి దర్శకత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'అయ్యప్పనుం కోశియుం' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ నటించిన ఈ సినిమాను, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా ప్రియా భవానీని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం వహిస్తాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.  'అయ్యప్పనుం కోశియుం' సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానా - వెంకటేశ్ కాంబినేషన్ ఈ కథకి కరెక్ట్ గా సెట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha