Hrithik Roshan: విడిపోయిన బాలీవుడ్ జంటను కలిపిన కరోనా!

Sussanne Khan moves in with ex husband Hrithik Roshan
  • 2014లో విడాకులు తీసుకున్న హృతిక్ రోషన్, సుసానే
  • లాక్ డౌన్ నేపథ్యంలో ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయం
  • సుసానేను ప్రశంసించిన హృతిక్ రోషన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుసానే 2014లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి ఇద్దరి పిల్లల కోసం వారు అప్పుడప్పుడు కలుస్తుంటారు. తాజాగా, ఈ జంటను కరోనా వైరస్ ఒకటి చేసింది. దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ అయిన నేపథ్యంలో పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని హృతిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

తమ పిల్లలు హ్రేహాన్, హృదాలతో కలసి ఉండేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని హృతిక్ తెలిపాడు. ఈ 21 రోజులు తామంతా కలిసే ఉంటామని చెప్పారు. సుసానే గత కొన్ని రోజులుగా తమ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోందని తెలిపాడు. పిల్లల పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పాడు. తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ 'నీవు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ సుసానే' అన్నాడు హృతిక్.
Hrithik Roshan
Sussanne Khan
Local Body Polls
Bollywood

More Telugu News