Bhadradri Kothagudem District: ఖమ్మం డీఎస్పీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. హత్యాయత్నం కేసు?

Khammam police to file case against police officer
  • లండన్‌లో చదువుకుంటున్న పోలీసు అధికారి కుమారుడు
  • కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్న యువకుడు  
  • ఎస్పీని కలిసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డీఎంహెచ్‌వో ఫిర్యాదు
లండన్ నుంచి వచ్చిన కుమారుడి వివరాలను దాచిపెట్టిన ఖమ్మం డీఎస్పీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తనయుడి వివరాలు వెల్లడించకుండా, హోం క్వారంటైన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ డీఎంహెచ్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసు అధికారి కుమారుడు అక్కడి నుంచి కారులో కొత్తగూడెం చేరుకున్నాడు. అక్కడ బంధుమిత్రులను కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. కాగా, రెండు రోజుల క్రితం పోలీసు అధికారికి, వారి ఇంట్లోని పనిమనిషిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ నాయక్.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ ఎస్పీ సునీల్‌దత్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
Bhadradri Kothagudem District
Police
Corona Virus
London
Murder case

More Telugu News