Spain: స్పెయిన్‌లో ఒక్కరోజే 738 మంది మృతి

  • మరణాల్లో చైనాను దాటేసిన స్పెయిన్
  • ప్రపంచవ్యాప్తంగా 16 వేలు దాటిన మరణాలు
  • ఒక్క ఇటలీలోనే 6 వేల మంది మృతి
Spain records in Corona deaths

స్పెయిన్‌లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే అక్కడ ఏకంగా 738 మందిని కరోనా బలితీసుకున్నట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. స్పెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరణాల్లో ఆ దేశం చైనాను దాటిపోయింది. చైనాలో 3,285 మంది మాత్రమే మరణించగా, స్పెయిన్‌లో ఏకంగా 3,434 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 16 వేలు దాటిపోయింది. 4.40 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.  ఒక్క ఇటలీలోనే అత్యధికంగా 6 వేల మంది మరణించారు. ఇక, కరోనా వైరస్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలన్నీ దాదాపు లాక్‌డౌన్ ప్రకటించాయి. భారత్ కూడా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.

More Telugu News