పూరితో సినిమా చేయడానికి మొగ్గుచూపుతున్న మహేశ్ బాబు?

Wed, Mar 25, 2020, 11:11 AM
puri Jagannadh Movie
  • పూరితో రెండు హిట్లు కొట్టిన మహేశ్ 
  • ఆ తరువాత సెట్ కాని ప్రాజెక్ట్
  • త్వరలో సినిమా చేసే అవకాశం
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేశ్ బాబు 'పోకిరి' .. 'బిజినెస్ మేన్' వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఆ మధ్య మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలని పూరి ప్రయత్నించాడు. అయితే వరుస కమిట్మెంట్ల కారణంగా మహేశ్ బాబు చేయలేకపోయాడు.

ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడం వల్లనే మరో ప్రాజెక్టు సెట్ కాలేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ ను మళ్లీ సెట్ చేయాలనే ఉద్దేశంతో సన్నిహితులు కొందరు రంగంలోకి దిగారట. పూరితో సినిమా చేయడానికి మహేశ్ బాబు కూడా మొగ్గుచూపుతుండటంతో, ఈ ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే పూరి - మహేశ్ బాబు కాంబినేషన్లో మరో సినిమా రావడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha