Ugadi: ఉగాది పంచాంగం: ఆయా రాశుల వారికి ఆదాయ, వ్యయాలు.. రాజ్యపూజ్య, అవమానాల వివరాలు!

  • నిరాడంబరంగా తెలుగు రాష్ట్రాల్లో పంచాంగ శ్రవణం
  • కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు
  • బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోతుంది
  • అంచనా వేసిన పండితులు
Panachanga Sravanam Details in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉగాది పర్వదినం కాగా, అధికార పంచాంగ శ్రవణాలు నిరాడంబరంగా సాగాయి. శ్రీ శార్వరీ నామ సంవత్సరం శుభ ఫలితాలను అందిస్తుందని, వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని పండితులు వెల్లడించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకూ కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటాయని అంచనా వేశారు.

ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుందని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోతుందని హెచ్చరించారు. విద్యారంగంలో సంస్కరణలు జరుగుతాయని, కుంభకోణాలు జరగవచ్చని, రియల్ ఎస్టేట్ రంగం అంతంతమాత్రంగానే ఉంటుందని అంచనా వేశారు. ఇక 12 రాశుల వారికీ ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానాలను పరిశీలిస్తే...

మేష రాశి : ఆదాయం - 5, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 3, అవమానం - 1
వృషభ రాశి : ఆదాయం - 14, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 6, అవమానం - 1
మిధున రాశి : ఆదాయం - 2, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 2, అవమానం - 4
కర్కాటక రాశి : ఆదాయం - 11, వ్యయం - 8; రాజ్యపూజ్యత - 5, అవమానం - 4
సింహ రాశి : ఆదాయం - 14, వ్యయం - 2; రాజ్యపూజ్యత - 1, అవమానం - 7
కన్యా రాశి : ఆదాయం - 2, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 4, అవమానం - 0
తులా రాశి : ఆదాయం - 14, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 7, అవమానం - 7
వృశ్చిక రాశి : ఆదాయం - 5, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 3, అవమానం - 3
ధనస్సు రాశి : ఆదాయం - 8, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 6, అవమానం - 3
మకర రాశి : ఆదాయం - 11, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 2, అవమానం - 6
కుంభ రాశి : ఆదాయం - 11, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 5, అవమానం - 6
మీన రాశి : ఆదాయం - 8, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 1, అవమానం - 2


More Telugu News