Law Suit: చైనా నుంచి 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ అమెరికా న్యాయవాది కేసు!

  • వైరస్ ను సృష్టించింది చైనాయే
  • వూహాన్ లోనే అభివృద్ధి చేశారు
  • జరిగిన నష్టానికి పరిహారం కట్టాల్సిందే
  • టెక్సాస్ కోర్టులో దావా వేసిన న్యాయవాది లారీ క్లేమన్
Law Suit on China over Corona

కరోనా మహమ్మారిని చైనాయే సృష్టించిందని, దాని గురించి మిగతా దేశాలను హెచ్చరించడంలో విఫలమై, తీవ్ర నష్టానికి కారణమైందని ఆరోపిస్తూ, 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్‌ కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్‌ ఓ కేసు దాఖలు చేశారు.

క్లేమన్‌ నేతృత్వంలో నడుస్తున్న ఫ్రీడమ్ వాచ్‌ అండ్‌ బజ్‌ ఫోటోస్‌ అనే సంస్థ టెక్సాస్‌ లో ఉన్న అమెరికా జిల్లా కోర్టులో ఈ లాసూట్ ను దాఖలు చేసింది. కరోనా వైరస్‌ ను జీవ రసాయన ఆయుధంగా చైనా అభివృద్ధి చేసిందని, అమెరికా చట్టాలతో పాటు అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘించిందని తన దావాలో ఆయన ఆరోపించారు.

తన ప్రత్యర్ధి దేశాలను నష్టపరిచేందుకే చైనా ఈ పని చేసిందని, ప్రజలను చంపే ఉద్దేశంలోనూ ఉందని, ప్రపంచానికి వాటిల్లిన నష్టానికి ఆ దేశమే పరిహారం చెల్లించాలని క్లేమన్ డిమాండ్ చేశారు. వుహాన్‌ లోని వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ఇది తయారైందని కూడా ఆయన ఆరోపించారు. కాగా, ఈ వైరస్ వ్యాప్తికి కారకులు మీరంటే, మీరేనని చైనా, అమెరికాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News