'వాలిమై'లో అజిత్ ద్విపాత్రాభినయం

25-03-2020 Wed 10:13
  • అజిత్ తాజా చిత్రంగా 'వాలిమై'
  • పోలీస్ ఆఫీసర్ గా అజిత్ 
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా
Valimai Movie
అజిత్ కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'వాలిమై' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఆ తరువాత షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారు.

వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అజిత్ కనిపించనున్నాడనే వార్త కొన్ని రోజుల క్రితం బయటికి వచ్చింది. పోలీస్ ఆఫీసర్ పాత్రతో పాటు ఆయన మరో పాత్రలోను కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఆ పాత్ర ఏమిటనేది గోప్యంగా ఉంచారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే విషయం ఆయన అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించే అంశమే. నీరవ్ షా ఫొటోగ్రఫీ .. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెబుతున్నారు.