Harish Shankar: ఇదోరకం 'చైనా పురాణం'... దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ చేయగా వైరల్!

Harish Shanker Tweet goes Viral
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీశ్ శంకర్
  • ట్విట్టర్ లో షేర్ చేసిన ట్వీట్ లో మెసేజ్
  • కామెంట్లతో నింపేస్తున్న అభిమానులు
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే దర్శకుడు హరీశ్ శంకర్, తాజాగా కరోనా వైరస్ పై పోస్ట్ చేసిన 'చైనా పురాణం' ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తొలుత ఎవరి నుంచి వచ్చిందో తెలియదుగానే, హరీశ్ శంకర్ షేర్ చేయగానే, దీనిపై ఎన్నో కామెంట్లు వచ్చాయి. ఇది తనకు వాట్స్ యాప్ లో వచ్చిందని ఆయన తెలిపారు. పైకి 'చైనా పురాణం'లా కనిపిస్తున్న కవితలో ఓ మెసేజ్ కూడా దాగుంది.

ఇటునుం 'చైనా'
అటునుం 'చైనా'
ఎటునుం  'చైనా'
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం 'చైనా' జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం 'చైనా' పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం 'చైనా' చెబుదాం.
వారికి కాస్త మం 'చైనా' చేద్దాం
అంతకు మిం 'చైనా' సాధిద్దాం
ఇది హరీశ్ శంకర్ పెట్టిన ట్వీట్. బాగుంది కదా?
Harish Shankar
China
Twitter

More Telugu News