Corona Virus: లండన్ నుంచి శ్రీకాళహస్తి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ

London returned Srikalahasthi man tested corona positive
  • ఏపీలో 8కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
  • మరో 14 మంది ఫలితాలు రావాల్సి ఉందన్న వైద్య ఆరోగ్యశాఖ
  • 14,907 మందిని పర్యవేక్షణలో ఉంచినట్టు వెల్లడి
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తాజాగా లండన్ నుంచి శ్రీకాళహస్తి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మరో 14 మంది శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే విదేశాల నుంచి 453 మంది వచ్చారని, ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 14,907 మందిని పర్యవేక్షణలో ఉంచామని అధికారులు తెలిపారు.

కడప, విశాఖ, గుంటూరులో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. రోజుకు 1000కి పైగా శాంపిల్స్ పరీక్షిస్తారని అన్నారు. కాగా, 12,131 పడకలతో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఆయా కేంద్రాల వద్ద సీనియర్ అధికారులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై బులెటిన్ విడుదల చేసింది.
Corona Virus
Andhra Pradesh
London
Srikalahasti

More Telugu News