రేపు ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్

24-03-2020 Tue 19:06
  • అభిమానులకు సంతోషం కలిగించే ప్రయత్నమన్న ఎన్టీఆర్
  • ఆన్ లైన్ లో వేచిచూడండి అంటూ ట్వీట్
  • ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ ను ఎంజాయ్ చేయాలంటూ సూచన
Ntr says tomorrow RRR title logo and motion poster will be released

తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో తమవంతుగా అభిమానుల్లో కాస్తంత జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నామని టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. రేపు ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. ఆన్ లైన్ లో వీటి కోసం వేచిచూడండి... మోషన్ పోస్టర్ ను ఎంజాయ్ చేయండి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇంటివద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ సూచించారు.