Nirmala Sitharaman: బ్యాంకుల్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు: నిర్మలా సీతారామన్

  • కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు
  • రుసుం లేకుండా ఇతర ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చన్న నిర్మల
  • 3 నెలల పాటు వెసులుబాటు
Nirmala Sitharaman says no need to maintain minimum balance

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు ప్రకటించారు. బ్యాంకుల్లో ఇకపై కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఖాతాదారులు అన్ని ఏటీఎంల్లో డబ్బు తీసుకోవచ్చని, 3 నెలల పాటు చార్జీలు లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నా ఎలాంటి రుసుం ఉండబోదని అన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మినిమమ్ బ్యాలన్స్ నిబంధన తొలగించడం, ఏ ఏటీఎంలోనైనా నగదు తీసుకునే సౌలభ్యం కల్పించడం సామాన్యుడికి ఊరట కలిగించనుంది.

More Telugu News