Amala Paul: నేను రెండో పెళ్లి చేసుకోలేదు: అమలాపాల్

My second marriage is not true clarifies Amala Paul
  • అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుందంటూ వార్తలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి ఫొటోలు
  • అది కేవలం ఫొటో షూట్ మాత్రమేనన్న అమల
సినీ నటి అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందనే వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముంబై సింగర్ భవీందర్ సింగ్ ను పెళ్లాడిందని వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లి సందర్భంగా భవీందర్ తో లిప్ లాక్ ఫొటోలు హల్ చల్ చేశాయి.

తాజాగా ఓ తమిళ చానల్ తో అమలా పాల్ ముచ్చటించింది. తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. తాను రెండో పెళ్లి చేసుకోలేదని తెలిపింది. తాను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫొటో షూట్ అది అని  చెప్పింది. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని తెలిపింది.

తమిళ సినీ దర్శకుడు ఏఎల్ విజయ్ ను అమలాపాల్ ప్రేమించి పెళ్లాడింది. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో, అమల రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.
Amala Paul
Second Marriage
Clarity
Tollywood

More Telugu News