Nara Lokesh: గల్లా జయదేవ్ కు, అనితకు బర్త్ డే విషెస్ తెలిపిన నారా లోకేశ్

Nara Lokesh Wishes Galla and Anitha
  • అనిత, జయదేవ్ లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి
  • పార్లమెంటులో తెలుగువారి గొంతుకను పదికాలాలు వినిపించాలి
  • వరుస ట్వీట్లు చేసిన నారా లోకేశ్
టీడీపీ నేతలు గల్లా జయదేవ్, వంగలపూడి అనిత లు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ వారికి  శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వేర్వేరు ట్వీట్లు చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అన్నారు.  

మరో ట్వీట్ లో.. ఆత్మీయులు, సోదరసమానులైన గల్లా జయదేవ్ కు జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. జయదేవ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పార్లమెంటులో తెలుగువారి గొంతుకను పదికాలాలపాటు ఇలాగే గంభీరంగా వినిపించే అవకాశాన్ని భగవంతుడు అందించాలని కోరుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
Nara Lokesh
Telugudesam
Galla Jayadev
Vangalapudi Anitha

More Telugu News