Omar Abdullah: నిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లా విడుదల

Centre lifts house detention on Omar Abdullah
  • గతేడాది జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగించిన కేంద్రం
  • ఎనిమిది నెలలుగా కశ్మీర్ నేతల గృహనిర్బంధం
  • ఇటీవలే ఫరూక్ అబ్దుల్లా విడుదల
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ఎత్తివేసినప్పటి నుంచి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై నిర్బంధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. దాంతో ఆయనను విడుదల చేశారు. గత ఎనిమిది నెలలుగా కశ్మీర్ నేతలకు గృహనిర్బంధం విధించారు. ఇటీవలే ఫరూక్ అబ్దుల్లాను కేంద్రం నిర్బంధం నుంచి విడుదల చేసింది. తాజాగా ఓ ప్రకటనలో ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధాన్ని పూర్తిస్థాయిలో ఎత్తివేస్తున్నట్టు జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్రణాళిక విభాగం) రోహిత్ కన్సాల్ వెల్లడించారు.
Omar Abdullah
Jammu And Kashmir
House Detention
Revoke

More Telugu News