Malaika Arora: హోమ్ క్వారంటైన్ లో బాలీవుడ్ ప్రేమ జంట

Malaika Arora and  Arjun Kapoor in self quarantine
  • కరోనా నేపథ్యంలో బాలీవుడ్  షూటింగులు  రద్దు
  • హోమ్ క్వారంటైన్ లో మలైకా అరోరా, అర్జున్ కపూర్
  • ఏడాది కాలంగా డేటింగ్ లో ఉన్న జంట
కరోనా వైరస్ విస్తరించకుండా తమ వంతుగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్వీయ నిర్బంధంలో ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కొత్త ప్రేమ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరూ  కలసికట్టుగా సెల్ఫ్ క్వారంటైన్ లో గడుపుతున్నారు. బాలీవుడ్ షూటింగులన్నీ రద్దు కావడంతో వీరిద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. గత ఏడాది కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూ సందర్భంగా  కూడా వీరిద్దరూ హోం క్వారంటైన్ లో ఉల్లాసంగా గడిపారు. జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంటలకు ఇద్దరూ బాల్కనీలోకి వచ్చి అత్యవసర సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి చప్పట్లు కొడుతూ సంఘీభావం ప్రకటించారు.
Malaika Arora
Arjun Kapoor
Self Quarantine
Bollywood

More Telugu News