manipur: ఈశాన్య భారతాన్ని తాకిన కరోనా.. మణిపూర్​ లో తొలి కేసు

  • ఇంపాల్‌లో 23 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌
  • ఇటీవల యూకే వెళ్లొచ్చినట్టు గుర్తింపు
  • దేశంలో 500 దాటిన కరోనా కేసులు
first confirmed case of infection reported from North East India is in manipur

కరోనా మహమ్మారి దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకింది. మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. ఉత్తర ఇంపాల్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారించారు.ఇటీవల యూకే వెళ్లొచ్చిన  ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తంగా 37 మంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 97 మందికి వైరస్‌ సోకింది. సోమవారం ఒక్క రోజే 23 కొత్త కేసులు వచ్చాయి. కేరళ 95 కేసులతో రెండో స్థానంలో ఉంది.

More Telugu News