Telangana: తెలంగాణలో మీ సేవా కేంద్రాల షట్ డౌన్: ఐటీ శాఖ ఉత్తర్వులు

Mee Seva Centers Shut down over Corona Fear
  • 31 వరకూ అమలులో నిర్ణయం
  • కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే
  • ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడివున్నామన్న ఆపరేటర్ల సమాఖ్య
ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న తెలంగాణలో, మీ సేవా కేంద్రాలను ఈ నెల 31 వరకూ మూసివేస్తున్నట్టు ఆపరేటర్ల సమాఖ్య వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధీనంలో 107 మీ సేవా కేంద్రాలుండగా, వాటిని నెలాఖరు వరకూ మూసివేయాలని నిన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల సమాఖ్య, వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడివున్నామని, మీ సేవా కేంద్రాలను మూసి వేస్తున్నామని స్పష్టం చేసింది.
Telangana
Mee Seva
IT Wing
Corona Virus
Shutdown

More Telugu News