Pavan kalyan: క్రిష్ సినిమాకి గ్యాప్ ఇస్తున్న పవన్!

  • పవన్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్'
  • క్రిష్ తో చేయనున్న చారిత్రక చిత్రం 
  • తన పోర్షన్ షూటింగ్ ఇప్పుడొద్దన్న పవన్
Viroopaksha Movie

పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' రూపొందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పట్ల అభిమానులు ఆసక్తితో వున్నారు. ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నాడు. చారిత్రిక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

ఏప్రిల్ మొదటి వారం నుంచి క్రిష్ పవన్ పోర్షన్ ను ప్లాన్ చేశాడట. ఆ వారం నుంచి హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు జరగవలసి వుంది. అయితే ఆ షెడ్యూల్ ను వాయిదా వేసుకోమనీ, 40 రోజుల వరకూ తనకి సంబంధించిన షూటింగును ప్లాన్ చేయవద్దని పవన్ కల్యాణ్ చెప్పాడట. దాంతో క్రిష్ ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు.

More Telugu News