Corona Virus: తగ్గిన కరోనా భయంతో కోలుకున్న ఆసియా మార్కెట్లు... నేటి సెషన్ ఆరంభంలోనే భారీ లాభాలకు అవకాశం!

  • చైనాలో తగ్గిన రోజువారీ మరణాల సంఖ్య
  • కరోనాకు ఔషధం సిద్ధమవుతోందంటున్న పలు దేశాలు
  • 6.74 శాతం పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా లాభంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ
Sentiment Boosts Stock market Investors

చైనాలో కరోనా కారణంగా రోజువారీ సగటు మరణాల సంఖ్య కనిష్ఠానికి చేరడం, వివిధ దేశాలు కరోనాకు ఔషధాన్ని కనిపెట్టడంలో ముందడుగు వేస్తున్నట్టుగా వస్తున్న వార్తలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో, నేడు ఆసియా మార్కెట్లు భారీ లాభాల దిశగా పరుగులు పెట్టాయి. దీని ప్రభావంతో ఎస్జీఎక్స్ నిఫ్టీ (అంచనా సూచిక) ఇప్పటికే 5 శాతానికి పైగా లాభంలో ఉండటంతో, నేటి భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా, మంగళవారం నాడు నిక్కీ సూచిక ఏకంగా 6.74 శాతం పెరిగింది. స్ట్రెయిట్స్ టైమ్స్ 3.38 శాతం, హాంగ్ సెంగ్ 3.90 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 5.84 శాతం, కోస్పీ 6.85 శాతం, సెట్ కాంపోజిట్ 2.79 శాతం, జకార్తా కాంపోజిట్ 1.11 శాతం, షాంగై కాంపోజిట్ 1.64 శాతం లాభపడ్డాయి. సోమవారం నాటి యూరప్ సూచికలు మాత్రం నష్టపోయాయి. ఎఫ్టీఎస్ఈ 3.79 శాతం, సీఏసీ 3.32 శాతం, డీఏఎక్స్ 2.10 శాతం దిగజారాయి.

More Telugu News