Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Rashmika is busy with reading scripts
  • స్క్రిప్టుల పరిశీలనలో బిజీగా రష్మిక 
  • హిట్ సినిమా సీక్వెల్ లో అనుష్క 
  • మలయాళం రీమేక్ లో బాలకృష్ణ
 *  మంచి స్క్రిప్టులు వుంటే తనను సంప్రదించాలంటూ ఇటీవల కథానాయిక రష్మిక ఇచ్చిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందట. పలువురు యువ దర్శకులు తమ స్క్రిప్టులను ఆమెకు పంపించారు. దాంతో ప్రస్తుతం రష్మిక, ఆమె టీమ్ వాటిని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే రష్మిక తన సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభిస్తుందట.
*  ఇటీవల మలయాళంలో సూపర్ హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో నందమూరి బాలకృష్ణను నటింపజేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.  
*  కమలహాసన్, జ్యోతిక జంటగా గౌతం మీనన్ దర్శకత్వంలో సుమారు పదిహేనేళ్ల క్రితం తమిళంలో వచ్చిన 'వెట్టేయాడు విలైయాడు' సినిమా విజయాన్ని సాధించింది. తెలుగులో దీనిని 'రాఘవన్' పేరిట అనువదించడం కూడా జరిగింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేయడానికి దర్శకుడు గౌతం మీనన్ సన్నాహాలు చేస్తున్నాడు. కథానాయిక పాత్రకు అనుష్కను తీసుకుంటున్నట్టు సమాచారం.  
Rashmika Mandanna
Kamal Haasan
Anushka Shetty
Balakrishna

More Telugu News