Corona Virus: పందొమ్మిది రాష్ట్రాలు లాక్ డౌన్: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

  • అందులో 6 రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి
  • ఇప్పటి వరకు 415 కేసులు నమోదయ్యాయి
  • ‘కరోనా’ బాధితుల కోసం ఆసుపత్రులను సిద్ధం చేయాలి
 central ministry says19 States Lock down

‘కరోనా’ మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సంయుక్తంగా   మీడియా సమావేశం నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉన్నాయని, అందులో 6 రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నట్టు వివరించారు. ‘కరోనా’ బాధితుల కోసం ఆసుపత్రులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 415 కేసులు నమోదయ్యాయని, 23 మంది డిశ్చార్జి అయ్యారని, ఏడుగురు మృతి చెందారని తెలిపారు.

దేశ వ్యాప్తంగా 15000 కేంద్రాల్లో నమూనాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. కరోనా పరీక్షా కేంద్రాలకు మార్గదర్శకాలు రూపొందించామని, ప్రైవేట్ సంస్థలకు కరోనా పరీక్షలకు అనుమతిస్తే పరీక్షల రుసుం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య మాత్రమే ఉండాలని సూచించారు.

More Telugu News