10 th class: ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు

  • ‘కరోనా’ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు  పదో తరగతి పరీక్షలు
  • ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్ లెట్ ల రవాణాకు అనుమతి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే, ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్ లెట్ ల రవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినట్లు చెప్పింది. ‘కరోనా’ నేపథ్యంలో పరీక్షల్లో విద్యార్థులు కూర్చునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని, ఎవరైనా విద్యార్థులు జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక  గదులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
10 th class
Andhra Pradesh
exams
Corona Virus
education ministry

More Telugu News