sajjanar: ‘లాక్ డౌన్’ నేపథ్యంలో రవాణా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నాం: సీపీ సజ్జనార్

  • నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవు
  • అవసరమైతే, క్రిమినల్ కేసుల నమోదుకు వెనుకాడం
  • రాష్ట్రంలో ’కరోనా‘ రెండో దశలో ఉంది
CP Sajjanar warns people in the wake of Lock Down

తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నిమిత్తం రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, రవాణా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తామని అన్నారు.

అవసరమైతే, క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం సమీపంలో ఉన్న దుకాణాలకే వెళ్లాలి తప్ప దూర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. అన్ని దుకాణాలు ఉదయం 6 గంటలకు తెరిచి సాయంత్రం 7 గంటలకే మూసివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ’కరోనా‘ రెండో దశలో ఉందని, స్వీయనియంత్రణ, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే  ఈ విపత్తును అడ్డుకోవచ్చని ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News