Eetala Rajender: తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది: మంత్రి ఈటల

Eetala Rajender says 33 positive cases in Telangana
  • తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 33
  • ‘కరోనా’ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా  ఓ ప్రకటన చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 33 కు చేరినట్లు వెల్లడించారు.

కాగా, హైదరాబాద్ లోని కోఠి కమాండ్ సెంటర్ లో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఈటల రాజేందర్ ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంఈ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో రాజేందర్ మాట్లాడుతూ, ‘కరోనా’ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రైవేట్ వైద్య కళాశాలలో 15,040 పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పీజీ వైద్య విద్యార్థుల సేవలతో పాటు నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని అన్నారు.
Eetala Rajender
TRS
Telangana
Corona Virus
33 positive

More Telugu News