Pradeep Machiraju: తెలుగు తెరకి మరో కొత్త కథానాయిక

30 Rojullo Preminchadam Ela Movie
  • సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను 
  • సినిమానే జీవితం అనుకోలేదు 
  • 'బిగిల్' అవకాశాలు తెచ్చిందన్న అమృత అయ్యర్
తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే వున్నారు .. తమ సత్తా చాటుకున్నవారు అగ్రస్థానానికి చేరుకుంటూనే వున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా 'అమృత అయ్యర్' కూడా చేరుతోంది. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే ఈ అమ్మడు, '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో  తెలుగు తెరకి పరిచయం అవుతోంది.

తాజా ఇంటర్వ్యూలో అమృత మాట్లాడుతూ .. "నేను సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చాను. మా వైపు నుంచి సినిమాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తిని నేనే. సినిమానే జీవితమనుకుని రాలేదు .. ఏదో సరదాగా ఒకటి రెండు సినిమాలు చేసి వెళదామని వచ్చాను. కానీ 'బిగిల్' హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఒక సినిమా చేస్తుండగానే మరో రెండు ఆఫర్లు రావడం విశేషం. ఇది గ్లామర్ ఫీల్డ్ అనే విషయం నాకు తెలుసు. నా వరకూ హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపించేంతవరకూ అయితే ఓకే. అంతకుమించి అంటే నా వల్ల కాదు" అని తన మనసులోని మాటను చెప్పేసింది.
Pradeep Machiraju
Amritha Aiyaer
30 Rojullo Preminchadam Ela

More Telugu News